శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా మెప్పిస్తాడా ?


శర్వానంద్ గ్యాంగ్ స్టర్ గా మెప్పిస్తాడా ?

Sharwanand’s Ranarangam first look released
శర్వానంద్ గ్యాంగ్ స్టర్

శర్వానంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” రణరంగం ”. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు . ఈరోజు ఈ చిత్ర టైటిల్ తో పాటుగా చిత్ర లోగో ని విడుదల చేసారు ఆ చిత్ర బృందం . మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 2 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

శర్వానంద్ ఇంతకుముందు మాఫియా డాన్ గా రెండు చిత్రాల్లో నటించాడు . అయితే ఆ రెండు కూడా డిజాస్టర్ అయ్యాయి . ఇక ఇప్పుడేమో మరో రకమైన డాన్ గా నటిస్తున్నాడు . పైగా ఈ సినిమా 1990 కాలంలో అలాగే 2000 తర్వాత కాలంలో సాగుతుంది . దాంతో శర్వానంద్ క్యారెక్టర్ రెండు రకాలుగా కనిపించనుంది . శర్వా గ్యాంగ్ స్టర్ గా మెప్పిస్తాడా ? విజయం సాధిస్తాడా ? అన్నది ప్రశ్నగా మారింది . పడిపడి లేచె మనసు వంటి ప్లాప్ తర్వాత శర్వానంద్ నుండి వస్తున్న చిత్రం కావడంతో శర్వా పై ఒత్తిడి ఉంది .