శర్వానంద్ సినిమా రణరంగం రిలీజ్ వాయిదా ?


Ranarangam
Ranarangam

శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం రిలీజ్ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది . ఆగస్టు 2 న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు . డేట్ కూడా ఫిక్స్ చేసి ప్రకటించారు అయితే అలా ప్రకటన వచ్చిన తర్వాత శర్వానంద్ షూటింగ్ లో గాయపడ్డాడు దాంతో భుజానికి శస్త్ర చికిత్స చేసారు రెండు నెలల విశ్రాంతి తప్పదని సలహా ఇచ్చారు డాక్టర్లు .

ఇంకేముంది రణరంగం విడుదలలో సమస్యలు వస్తున్నాయి , అందుకే ఆగస్టు 2 న కాకుండా మరో డేట్ కి విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారట . రణరంగం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాలేదు అలాగే కొంత ప్యాచ్ వర్క్ కూడా ఉందట దాంతో ఆగస్టు 2 న రణరంగం చిత్రాన్ని విడుదల చేయడం కష్టమే అని అంటున్నారు . కొత్త డేట్ ఎప్పుడు అనేది త్వరలోనే ప్రకటిస్తారట . సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శర్వానంద్ డాన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే .