ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటున్న యంగ్ హీరో


Sharwanand
Sharwanand

యంగ్ హీరో శర్వానంద్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంటున్నాడు . తాజాగా ఈ హీరో నటించిన రణరంగం చిత్రం విడుదల అయ్యింది . సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు . ఆగస్టు 15 న విడుదలైన రణరంగం చిత్రానికి శర్వా కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ లభించాయి .

అయితే పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ లేదు దాంతో ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తున్నారు . ఆ సందర్బంగా మీడియా ముందుకు వచ్చిన శర్వా తన పెళ్లి పై స్పందించాడు . ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పాడు . ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే చెబుతాం కదా ! అని అంటున్నాడు శర్వా . గ్యాంగ్ స్టర్ గా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రని పోషించి మెప్పించాడు శర్వానంద్ .