శర్వా కొత్త సినిమా మొదలయ్యింది


Sharwanand
Sharwanand

భుజానికి శస్త్ర చికిత్స జరిగి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న శర్వానంద్ ఈరోజు కొత్త సినిమాని పట్టాలెక్కించాడు . కిషోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ పై ఈ కొత్త చిత్రం తెరెకెక్కనుంది . ఇక ఈ చిత్రానికి ”శ్రీకారం ” అనే టైటిల్ ని ఖరారు చేసారు . ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా శ్రీకారం ప్రారంభమైంది .

అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం సమయం పడుతుంది ఎందుకంటే శర్వా భుజానికి గాయం కావడంతో శస్త్ర చికిత్స జరిగింది కాబట్టి .
ఇక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న దర్శకులు సుకుమార్ మొదటి సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు . ఇక శర్వానంద్ నటించిన రణరంగం ఆగస్టు లో విడుదల కానుంది . నిన్ననే రణరంగం టీజర్ విడుదలైన విషయం తెలిసిందే .