శ‌ర్వా `శ్రీ‌కారం` న్యూ షెడ్యూల్ డిటైల్స్‌!


శ‌ర్వా `శ్రీ‌కారం` న్యూ షెడ్యూల్ డిటైల్స్‌!
శ‌ర్వా `శ్రీ‌కారం` న్యూ షెడ్యూల్ డిటైల్స్‌!

బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు యంగ్ హీరో శ‌ర్వానంద్‌. మారుతి డైరెక్ష‌న్‌లో చేసిన `మ‌హానుభావుడు` చిత్రం త‌రువాత శ‌ర్వా హిట్ మాట విని చాలా రోజులే అవుతోంది. ప‌డి ప‌డి లేచే మ‌న‌సు, ర‌ణ‌రంగం, జాను.. ఇలా వ‌రుస‌గా మూడు ఫ్లాపులు రావ‌డంతో ప్ర‌స్తుతం శ‌ర్వానంత్ యుఎస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం `శ్రీ‌కారం`. కిషోర్ బి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇటీవ‌ల కొంత భాగం హైద‌రాబాద్ ప‌రిస‌ర  ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా షెడ్యూల్ శ‌ర్వా అమెరికా నుంచి వ‌స్తే కానీ ప్రారంభః కాదు. టీమ్ అంతా ఇప్పుడు శ‌ర్వానంద్ కోసం ఎదురుచూస్తోంది.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం తాజా షెడ్యూల్‌ని ఈ నెల 18 నుంచి ప్రారంభించ‌బోతున్నార‌ట‌. ఆలోపే శ‌ర్వానంద్ ఇండియా రాబోతున్నాడ‌ని తెలిసింది. తిరుప‌తితో పాటు హైదారాబాద్‌లో ఓ పాట కొంత టాకీ పార్ట్ మిన‌హా ఎంటైర్ షూటింగ్ మొత్తం పూర్తి చేయ‌బోతున్నారు.  గ్రామీణ నేప‌థ్యంలో `శ‌త‌మానం భ‌వ‌తి` త‌ర‌హా కుటుంబ విలువ‌ల‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమాలో శ‌ర్వానంద్ రైతుగా క‌నిపిస్తార‌ట‌. ఏప్రిల్ 24న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.