శర్వానంద్ పారితోషికం తీసుకోవట్లేదా?

శర్వానంద్ పారితోషికం తీసుకోవట్లేదా?
శర్వానంద్ పారితోషికం తీసుకోవట్లేదా?

యంగ్ హీరో శర్వానంద్ సటిల్ పాత్రలను ఎక్కువగా చూజ్ చేసుకుంటాడు. అయితే ఈ మధ్య కాలంలో శర్వానంద్ నుండి సరైన విజయం దక్కింది లేదు. దీంతో కొంత రూట్ మార్చాడు శర్వా. మహా సముద్రం వంటి ఇంటెన్స్ కథను చేస్తున్నాడు. దీని తర్వాత ఈ హీరో చేయనున్న చిత్రం ఆడవాళ్ళూ మీకు జోహార్లు. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. రష్మిక మందన్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నటిస్తున్నందుకు శర్వా పారితోషికం తీసుకోవట్లేదట. నిజానికి సుధాకర్ శర్వానంద్ తో పడి పడి లేచే మనసు సినిమా  తీసి కోట్లలో నష్టపోయాడు. ఆ సమయంలోనే శర్వానంద్ తనకు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు.

అందుకోసమే ఆడవాళ్ళూ మీకు జోహార్లు చిత్రం కోసం శర్వానంద్ పారితోషికం ఏం తీసుకోవట్లేదు. సుధాకర్ తన నష్టాలను పూడ్చుకుని లాభాలు గడించిన తర్వాత అందులో వాటా తీసుకుంటాడట. ఇంత మంచి మనసు ఉంది కాబట్టే శర్వానంద్ ఇన్నాళ్ల నుండి ఇండస్ట్రీలో హీరోగా కొనసాగగలుగుతున్నాడు.