శ‌ర్వా – సిద్ధార్ధ్ `మ‌హా స‌ముద్రం` థీమ్ పోస్ట‌ర్!


Sharwanands Maha samudram theam poster
Sharwanands Maha samudram theam poster

`Rx`100` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. `మ‌హా స‌ముద్రం` పేరుతో తెర‌పైకి రానున్న ఈ భారీ యాక్ష‌న్ ఎటంర్‌టైన‌ర్‌లో శ‌ర్వానంద్, `బొమ్మ‌రిల్లు` సిద్ధార్ధ్ హీరోలుగా న‌టిస్తున్నారు. ఏకే ఎంట‌ర్‌టైమెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అదితిరావు హైద‌రీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తీ అప్‌డేట్‌ని మేక‌ర్స్ సంద‌ర్భాన్ని బ‌ట్టి రివీల్ చేస్తున్నారు. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ టాక్ ఆఫ్ ఇది ఇండ‌స్ట్రీగా మారింది. దీపావ‌ళి సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు శుభాకాంక్ష‌లు అంద‌జేసిన ఈ మూవీ మేక‌ర్స్ ఈ సంద‌ర్భంగా ఈ మూవీ థీమ్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు.

`బైగోన్స్ బైగోన్స్ గానే వుండ‌నివ్వండి.. ప్రేమ ఎప్ప‌టికీ వుంటుంది…` అంటూ విడుద‌ల చేసిన థీమ్ పోస్ట‌ర్ సినిమా పై అంచ‌నాల్ని పెంచేస్తోంది. ఎర్ర‌బారిన ఆకాశం.. ఎక్కు పెట్టిన తుపాకి.. మ‌రో ప‌క్క శ‌ర్వానంద్ హాఫ్ హెడ్‌..తుపాకి సింబ‌ల్‌పై ప్రేమ జంట‌… మ‌రో ప‌క్క పారిపోతున్న వ్య‌క్తి .. వీరి మ‌ధ్య స‌ముద్ర‌పు ఒడ్డున వున్న ఓ న‌గ‌రాన్ని చూపించారు. ఓ ప‌క్క ప్రేమ .. మ‌రో ప‌క్క యుద్ధం.. అంటూ చూపించిన థీమ్ పోస్ట‌ర్ చాలా ఎఫెక్టీవ్‌గా వుంది. ఈ పోస్ట‌ర్‌ని ట్వీట్ చేసిన హీరో శ‌ర్వానంద్ `నేను త‌రంగాల కంటే మెండిగా వున్నాను. స‌ముద్రాల కంటే లోతుగా వున్నాను!.. ఎవ‌రు నువ్వు?` అని ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా వుంది.