రణరంగం టీజర్ టాక్


Sharwanand's Ranarangam teaser talk
Sharwanand’s Ranarangam teaser talk

శర్వానంద్ హీరోగా నటించిన రణరంగం టీజర్ ఈరోజు సాయంత్రం విడుదల అయ్యింది . సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రణరంగం మాఫియా నేపథ్యంలో రూపొందింది . శర్వా సరసన ఇద్దరు భామలు కాజల్ అగర్వాల్ , కళ్యాణి ప్రియదర్శన్ లు నటిస్తున్నారు . కాగా ఈ చిత్రాన్ని ఆగస్టు లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దాంతో ఈరోజు టీజర్ విడుదల చేసారు .

టీజర్ చూస్తుంటే యాక్షన్ సినిమాని తలపించేలా కనిపిస్తోంది , దానికి తోడు రణరంగం టైటిల్ కాబట్టి ఈ తరహా సినిమా శర్వానంద్ కు కష్టమే అనుకుంటా . ప్రస్థానం సినిమా మినహా ఈలాంటి సినిమాలు శర్వానంద్ కు హిట్స్ తెచ్చిపెట్టలేకపోయాయి . చాలాసార్లు ఇలా ప్రయత్నించి విఫలమయ్యాడు కూడా . అయితే రణరంగం సినిమా రిలీజ్ అయితే కానీ తెలీదు ఎలాంటి ఫలితాన్ని నమోదు చేస్తుందో అన్న సంగతి . అయితే టీజర్ మాత్రం బాగానే ఉంది .