సావిత్రి సినిమా తీసి పరువు తీసారంటున్న షావుకారు


మహానటి సావిత్రి బయోపిక్ మహానటి ని తీసిన విషయం తెలిసిందే . సంచలన విజయం సాధించిన ఆ చిత్రాన్ని తీయకుండా ఉండాల్సింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సీనియర్ నటి షావుకారు జానకి . అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొన్న షావుకారు జానకి సావిత్రి బయోపిక్ పై తన వ్యాఖ్యలను నిర్మొహమాటంగా చెప్పేసింది . 
 
సావిత్రి బయోపిక్ తీయొద్దని , ఆ సినిమా తీయడం వల్ల ఎవరికి ఉపయోగం అంటూ అశ్వినీదత్ ని ప్రశ్నించానని నేను ఎవరికీ భయపడేది లేదు అంటూ అసలు విషయాన్నీ చెప్పింది . సావిత్రి మహానటి అంతవరకే ! అంతేకాని వ్యక్తిగత జీవితాన్ని చూపించి ఆమెని అభిమానించే వాళ్ళని బాధపెట్టారని తన బాధని వ్యక్తం చేసింది . సావిత్రికి జెమిని గణేశన్ తగిన వ్యక్తి కాదంటూ నేను పలుమార్లు హెచ్చరించానని కానీ సావిత్రి నా మాట వినలేదని అతడి మాయలో పడిందని కన్నీళ్ల పర్యంతం అయ్యింది షావుకారు జానకి .