మా అందరి హృదయాల్లో ఆమె ఇంకా బ్రతికే వున్నారు..

Sridevi
Sridevi

అలనాటి అందాలనటి శ్రీదేవి అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే.. ఎన్నో గొప్ప చిత్రాలు, అందులో మరపురాని పాత్రలు, చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహోన్న తమైన వ్యక్తి నటి శ్రీదేవి.

ఇప్పుడు ఆమె మైనపు విగ్రహాన్ని సింగపూర్ నందు గల ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు.

సెప్టెంబర్ 4న గ్రాండ్ గా శ్రీదేవి విగ్రహాన్ని ఆ మ్యూజియంలో లాంచ్ చేయనున్నారు. ఈ సందర్భంగా భర్త బోనీ కపూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. శ్రీదేవి “మా హృదయాలలోనే కాదు, లక్షలాదిగా ఉన్న ఆమె అభిమానుల హృదయాలలో ఆమె ఇంకా బ్రతికే ఉన్నారు. ఈనెల 4న మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న నా శ్రీమతి విగ్రహం కోసం నేను చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను” అని ట్వీట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ట్వీట్లో శ్రీదేవి విగ్రహానికి మెరుగులు దిద్దుతున్న ఒక చిన్న ప్రోమో వీడియోని కూడా పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో శ్రీదేవి బంగారు వన్నె వస్త్రాలలో, కిరీటం ధరించి ఉన్నారు. ముఖ్యంగా శ్రీదేవి కళ్ళు చూస్తుంటే ఆమె విగ్రహమా లేక, పాలరాతి శిల్పమా అన్నంత అద్భుతంగా ఉన్నారు. అతిలోక సుందరి శ్రీదేవి మైనపు బొమ్మను చూడటానికి అభిమానులు ఎక్సయిటింగ్ గా వున్నారు. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ మైనపు బొమ్మను మేడం టు స్సాడ్స్ వారు లాంచ్ చేసిన విషయం తెలిసిందే..!!