స‌రోజ్‌ఖాన్ మృతి న‌న్ను బాధిస్తోంది-  అల్లు అర్జున్‌


స‌రోజ్‌ఖాన్ మృతి న‌న్ను బాధిస్తోంది-  అల్లు అర్జున్‌
స‌రోజ్‌ఖాన్ మృతి న‌న్ను బాధిస్తోంది-  అల్లు అర్జున్‌

మ‌ద‌ర్ ఆఫ్ డ్యాన్స్ స‌రోజ్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ఈ శుక్ర‌వారం తెల్ల‌వారు జామున హార్ట్ ఎటాక్‌తో మృతి చెందిన విష‌యం తెలిసిందే. ఆమె మృతి ప‌ట్ల ప్ర‌ముఖ స్టార్స్ తో పాటు యావ‌త్  సినీ లోకం విచారాన్ని వ్య‌క్తం చేసింది. రెండు వేల‌కు పైగా సినిమాలకు డ్యాన్స్ కంపోజ్ చేసి జాతీయస్థాయిలో పుర‌స్కారాల్ని సొంతం చేసుకున్న స‌రోజ్‌ఖాన్ మృతి ప‌ట్ల స్టార్ హీరో అల్లు అర్జున్ విచారాన్ని వ్య‌క్తం చేశారు.

ఆమె మృతి త‌న‌ని ఎంతో బాధించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆమె కుటుంబ స‌భ్యుల‌కు, స‌న్నిహితుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని వ్య‌క్తం చేశారు అల్లు అర్జున్‌. స‌రోజ్‌ఖాన్‌తో `డాడీ` సినిమాకు క‌లిసి ప‌నిచేసిన అనుభ‌వాల‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. త‌న సినీ కెరీర్‌లో తొలి కొరియోగ్రాఫ‌ర్‌గా స‌రోజ్ ఖాన్ వంటి అనుభ‌వ‌శాలితో ప‌నిచేయ‌డం నిజంగా త‌న అదృష్ట‌మ‌ని బ‌న్నీ ట్వీట్ చేశారు.

స‌రోజ్‌ఖాన్ మ‌ర‌ణం ఇండియ‌న్ సినిమాకు తీర‌ని లోట‌ని అల్లు అర్జున్ అభివ‌ర్ణించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన `డాడీ` చిత్రానికి స‌రోజ్‌ఖాన్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఈ చిత్రంలో బ‌న్నీ ఓ పాట‌లో స్టెప్స్ వేస్తూ స్టూడెంట్‌గా క‌నిపించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ వేసిన స్టెప్స్‌ని స‌రోజ్‌ఖాన్ స్వ‌యంగా కంపోజ్ చేయ‌డం విశేషం.