శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌లో విక్ట‌రీ!

శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌లో విక్ట‌రీ!
శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌లో విక్ట‌రీ!

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ దర్శకుడు శేఖర్ కమ్ముల గ‌త‌ 2 దశాబ్దాల కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మంది యువ తారలను పరిచయం చేశారు. అంతే కాకుండా మీడియం రేంజ్ హీరోలతో కూడా పనిచేశారు. స‌క్సెస్ రేట్ వున్నా కూడా ఇప్పటి వరకు శేఖ‌ర్ క‌మ్ముల‌ టాప్ లీగ్ స్టార్ల‌‌తో కలిసి పని చేయలేదు. కార‌ణం ఏంట‌న్న‌ది ఇంత వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌లేదు.

చాలా మంది స్టార్స్ ఆయ‌నతో క‌లిసి ప‌ని చేయాల‌ని ఆస‌క్తిని చూపించినా ఎందుకో శేఖ‌ర్ క‌మ్ముల ముందుకు రాలేదు. మ‌హేష్‌తో  సినిమా వుంటుందని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. శేఖ‌ర్ క‌మ్ముల కూడా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు కానీ అది కార్య‌రూపం దాల్చ‌లేదు. ఇదిలా వుంటే శేఖర్ క‌మ్ముల విక్ట‌రీ వెంక‌టేష్‌ని డైరెక్ట్ చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వి‌నిపిస్తున్నాయి.

శేఖర్ క‌మ్ముల‌ ఇటీవల విక్ట‌రీ వెంక‌టేష్‌ని క‌లిసి ఒక కథ‌ని చెప్పార‌ట‌. అది విన్న వెంకీ గ్రీన్ సిగ్నల్  ఇచ్చాడని, పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని కోరినట్లు తెలిసింది. `లవ్ స్టోరీ` విడుదలైన తర్వాత దర్శకుడు ఫుల్‌ బౌండ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తార‌ట‌. వెంకీ న‌టిస్తున్న `నారప్ప‌` మే 14న విడుదల కానుంది.