ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా?Who Eliminated in this week from Biggboss Telugu 3
Who Eliminated in this week from Biggboss Telugu 3

బిగ్ బాస్ వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఇది తెలుగులో కూడా మంచి సక్సెస్ అయింది. మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా, రెండో సీజన్ కౌశల్ కారణంగా ఒక రేజ్ వచ్చింది. ఇక ప్రస్తుతం నాగార్జున హోస్ట్ గా మూడో సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ గొడవలు, అలకలు, సరదాలు, ప్రేమలు మధ్య దిగ్విజయంగా నడుస్తోంది. అయితే ప్రతీ వారం షో నుండి ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే కదా!

గత వారం అలీ ఎలిమినేట్ కావడం అందరికీ ఒకింత షాక్ అనే చెప్పాలి. అయితే ఈ వారం ఎలిమినేట్ కావడానికి నామినేట్ అయిన సభ్యులు శ్రీముఖి, హిమజ, పునర్నవి, మహేష్, శిల్ప చక్రవర్తి. వీరిలో నుండి ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ శిల్ప ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు. అందరికన్నా తక్కువ ఓట్లు ఆమెకే పడుతుండడం దీనికి బలాన్ని ఇస్తోంది. వైల్డ్ కార్డ్ గా బిగ్ బాస్ లో అడుగుపెట్టిన శిల్ప, మొదటినుండీ మిగతా సభ్యులతో కలవడానికి ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ఈమె ఎలిమినేట్ కావడం ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి.