నితిన్ సినిమాకు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్టేనా?


నితిన్ సినిమాకు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్టేనా?
నితిన్ సినిమాకు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కన్ఫర్మ్ అయినట్టేనా?

వరస ప్లాపుల నుండి నితిన్ ఇటీవలే ఊరట పొందాడు. భీష్మ సినిమాతో చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నాడు నితిన్. ఈ సినిమా భారీ విజయం తర్వాత వరస సినిమాలను సెట్ చేసుకున్నాడు. ముందుగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా రంగ్ దే అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా లాక్ డౌన్ కారణంగా అన్ని పనులు వాయిదా పడిన విషయం తెల్సిందే. ఇక చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా కూడా షూటింగ్ మొదలై కొన్ని రోజుల తర్వాత బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది.

పైన చెప్పుకున్న రెండు సినిమాలు కాకుండా నితిన్ అంధధూన్ రీమేక్ ను చేస్తున్న విషయం కూడా తెల్సిందే. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రాన్ని తెరకెక్కించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ రీమేక్ తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మళ్ళీ ఊపందుకున్నాయి. ఈ సినిమాకు కీలకమైన పాత్ర కోసం ఎంపిక జరగాల్సి ఉంది. హిందీ చిత్రంలో టబు ఆ పాత్రను అద్భుతంగా పోషించింది. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రంలో మొదట ఆమే నటిస్తుంది అన్నారు. తర్వాత ఇతర సీనియర్ హీరోయిన్ల పేర్లు చాలా ప్రస్తావనకు వచ్చాయి.

ఇప్పుడు తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి పేరు పరిశీలిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. మరి ఈ వార్తైనా నిజమేనా లేక వట్టి రూమరేనా అన్న విషయం తెలియాలంటే మరికొద్ది కాలం ఆగక తప్పదు.