మోడీ తాత‌య్య లాక్‌డౌన్ ఇంకా వుంచు!


మోడీ తాత‌య్య లాక్‌డౌన్ ఇంకా వుంచు!
మోడీ తాత‌య్య లాక్‌డౌన్ ఇంకా వుంచు!

క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండ‌టంతో ప్ర‌పంచ దేశాల‌న్నీ లాక్ డౌన్‌ని ప్ర‌క‌టించాయి. క‌రోనా క‌ట్ట‌డి కోసం క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్లు చేశారు. అయినా అమెరికా, స్పెయిన్‌, ఇట‌లీ లాంటి దేశాల్లో ఇప్ప‌టికీ క‌రోనా మ‌ర‌ణాలు ఆగ‌డం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మ‌న దేశంలోనూ లాక్ డౌన్‌ని 21 రోజుల పాటు విధించారు. అయితే ఈ నెల 14తో ముగుస్తుండ‌టంతో విజ్ఞ‌ప్తులు మొద‌ల‌య్యాయి.

లాక్ డౌన్ కార‌ణంగా సెల‌బ్రిటీలు ఇళ్ల‌కే ప‌రిమిత‌మైపోయారు. ఇంటి ప‌ట్టునే వుంటూ ఫ్యామిలీకి అత్య‌‌ధిక స‌మ‌యాన్ని కేటాయిస్తున్నారు. పిల్ల‌ల‌తో పిల్ల‌లుగా మారిపోయి వారి న‌వ్వుల్లో కొత్త ఆనందాన్ని చూస్తున్నారు. కొత్త అనుభూతిని పొందుతున్నారు. ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ‌కూడా ఇదే అనుభూతిని పొందుతున్నాడు. త‌న త‌న‌యుడి ముద్దు ముద్దు మాట‌ల‌తో కాల‌క్షేపం చేస్తున్నారు.

లాఖ్‌డౌన్ మే 3 వ‌ర‌కు పొడిగిస్తున్న నేప‌థ్యంలో శివ నిర్వాణ షేర్ చేసిన ఓ ఫొటో ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫొటోకి `మోడీ తాత‌య్య లాక్ డౌన్ ఇంకా వుంచు నాన్న నాతోనే వుంటాడు` అని త‌న త‌న‌యుడు కోరుతున్న‌ట్టుగా క్యాప్ష‌న్ ఇవ్వ‌డం నెటిజ‌న్స్‌ని  ఆక‌ట్టుకుంటోంది. శిశ నిర్వాణ ప్ర‌స్తుతం నాని హీరోగా `ట‌క్ జ‌గ‌దీష్‌` చిత్రం చేస్తున్నారు.

Credit: Twitter