ఎక్స్‌క్లూసివ్‌:  శివాని సినిమా అప్పుడే పూర్త‌యిందే!

Shivani first film finally wraped
Shivani first film finally wraped

యంగ్రీ యంగ్‌మెన్ డా.రాజ‌శేఖ‌ర్ పెద్ద కుమార్తె శివానిని హీరోయిన్ ప‌రిచ‌యం చేస్తూ మొద‌లైన చిత్రం `2 స్టేట్స్‌`. వి.వి.వినాయ‌క్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన వెంక‌ట్‌రెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కావాల‌నుకున్నాడు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `2 స్టేట్స్‌` ఆధారంగా ఈ చిత్రాన్నిరీమేక్ చేయాల‌నుకున్నారు. ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కానీ సెట్స్‌పైకి వెళ్ల‌కుండానే ఈ సినిమా అర్థాంత‌రంగా ఆగిపోయింది.

శివాని సినిమా మ‌ళ్లీ ఎప్పుడ‌ని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే సైలెంట్‌గా శివాని సినిమా మొద‌లై పూర్తి కావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. `న‌రుడ డోన‌రుడా` చిత్రాన్ని రూపొందించిన మ‌ల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. `ఓ బేబీ` చిత్రంలో స‌మంత‌కు మ‌న‌వ‌డిగా న‌టించిన తేజ సజ్జ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. `అ!`, క‌ల్కి చిత్రాల ఫేమ్ ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రానికి క‌థ అందించారు.

సెస్టెంబ‌ర్‌లో మొద‌లైన ఈ చిత్రం ఇటీవ‌ల ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా పూర్త‌యింది. శివాని ఇందులో కాలేజ్ గాళ్‌ న‌టిస్తుంటే తేజ న్యూస్ రీడ‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఓ సైంటిఫిక్ రీజ‌న్ నేప‌థ్యంలో ఈ సినిమా క‌థ సాగుతుంద‌ని తెలిసింది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన ప‌బ్లిసిటీ డిజైన్స్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని క‌ట్ చేశార‌ట‌. త్వ‌ర‌లో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేయ‌బోతున్న‌ట్టు తెలిసిది. ఈ చిత్రాన్నిశేఖ‌ర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. రాజీవ్ క‌న‌కాల‌, దేవిప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ర‌ధ‌న్ సంగీతం అందిస్తున్నారు.