మొదలైన శివాత్మిక “విధి విలాసం”

Shivathmika Rajasekhar new movie started
Shivathmika Rajasekhar new movie started

అరుణ్ అదిత్ శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న సినిమా విధివిలాసం. ఈ సినిమా సోమవారం హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. “దొరసాని” సినిమా తర్వాత శివాత్మక రాజశేఖర్ నటిస్తున్న సినిమా ఇది. తన అందం, అభినయం తో మొదటి సినిమాకే అభిమానులను సంపాదించుకున్న శివాత్మిక తల్లిదండ్రులకు తగ్గ కూతురు అనిపించుకుంది. ఇప్పుడు ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు దుర్గా నరేష్ దర్శకుడు.శివ గణేష్ రాహుల్ అయ్యర్ నిర్మాత. ఇక ఈ సినిమా ప్రారంభ కార్యక్రమానికి హాజరై, రాజశేఖర్ తో గతంలో పిఎస్వి గరుడ వేగ అనే సూపర్ హిట్ సినిమా చేసిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఫస్ట్ క్లాప్ ఇచ్చారు. మరొక దర్శకుడు హరీష్ శంకర్ కెమెరా స్విచాన్ చేయగా, ప్రభాస్ తో మిస్టర్ పర్ ఫెక్ట్ ఇలాంటి సూపర్ హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన దశరథ్ గారు గౌరవ దర్శకత్వం వహించారు. జీవిత రాజశేఖర్ స్క్రిప్టు అందించారు.

ప్రస్తుత సినిమా విశేషాలను దర్శకుడు దుర్గేష్ పంచుకుంటూ, హీరో అరుణ్ అదిత్ తన స్నేహితుడని ఆయనతో సినిమా చేయడం ఆనందంగా ఉందని, తమ సినిమాలో శివాత్మక రాజశేఖర్ గారి క్యారెక్టర్ హైలెట్ అని తెలియజేశారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుందని, రామాయణంలో ఉన్నట్లే ఈ కథలో కూడా మూడు కోణాలు, మూడు విభిన్నమైన అంశాలు ఉంటాయని.. ప్రేక్షకులకు కచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతుందని నిర్మాత అన్నారు. ఇక ఈ సినిమాలోఇంద్రజ, కోటశ్రీనివాస్ రావు గారు, జయప్రకాష్, రాజారవీంద్ర, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్నారని చిత్ర యూనిట్ ప్రకటించింది.