విజయ్ దేవరకొండ తమ్ముడితో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక

shivatmika rajasekhar and anand deverakonda debut with dorasaniహీరోగా సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ తాజాగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని హీరోగా పరిచయం చేయనున్నాడు . ఇంతకుముందే ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం కానున్నట్లు టాలీవుడ్ వెల్లడించిన విషయం తెలిసిందే . కేవీఆర్ మహేంద్ర అనే యువ దర్శకుడి దర్శకత్వంలో ఓ విభిన్న కథా చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హీరో డాక్టర్ రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక నటించనున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే రాజశేఖర్ పెద్ద కూతురు శివాని హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా తాజాగా రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక కూడా హీరోయిన్ గా పరిచయం కానుండటం విశేషం .

ఇక ఈ చిత్రానికి ” దొరసాని ” అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది . తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కొత్త హీరో హీరోయిన్ లైతే బాగుంటుందని భావించి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని హీరోగా పరిచయం చేస్తున్నారు అలాగే దొరసాని పాత్రలో శివాత్మిక బాగుంటుందని భావించి ఆమేరకు రాజశేఖర్ అనుమతి తీసుకున్నారట దొరసాని నిర్మాతలు . ఇక ఈ చిత్రానికి వెన్నుదన్ను గా అగ్ర నిర్మాత సురేష్ బాబు నిలవడానికి ముందుకు వచ్చాడట . విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ అయ్యాడు మరి ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రేక్షకులను అలరిస్తాడా అన్నది తెలియాలంటే దొరసాని విడుదల అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: shivatmika rajasekhar and anand deverakonda debut with dorasani