రికార్డ్ స్థాయి వసూళ్ల ని సాధించిన ఆర్ ఎక్స్ 100


shocking collections for RX 100

హీరో హీరోయిన్ ఇద్దరూ కొత్తవాళ్లు ఆపై దర్శక నిర్మాతలు కూడా కానీ సినిమా మాత్రం మొదటి రోజునే రికార్డ్ స్థాయి వసూళ్ల ని సాధించి ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది ” RX 100” చిత్రం . నిన్న విడుదలైన ఈ చిత్రం పై పెద్దగా అంచనాలు లేవు కానీ యువత ని ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండటంతో భారీగా వసూళ్లు వచ్చాయి , నిన్న ఒక్క రోజులోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కోటి నలభై లక్షల గ్రాస్ వసూళ్ళ ని సాధించడం ట్రేడ్ విశ్లేషకులను , ఆ చిత్ర బృందాన్ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది .

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో పాటుగా విడుదలైన చిత్రానికి పెద్దగా కలెక్షన్లు లేవు ఇక మెగా మేనల్లుడు నటించిన తేజ్ ఐ లవ్ యు చిత్రానికి దారుణమైన కలెక్షన్లు వస్తున్నాయి . వారం రోజుల పాటు సాయి ధరం తేజ్ నటించిన చిత్రానికి వచ్చిన కలెక్షన్లు ఆర్ ఎక్స్ 100 చిత్రం ఒక్క రోజులోనే వసూల్ చేయడం సంచలనంగా మారింది .

హీరో కొత్తవాడు అలాగే హీరోయిన్ కూడా పైగా చిన్న చిత్రం అయినప్పటికీ యువత కు కావాల్సిన మసాలా దట్టంగా ఉండటంతో యువత ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు . దాంతో మొదటి రోజునే దాదాపు కోటిన్నర వసూల్ అయ్యింది . ఈ వసూళ్లు మరో మూడు రోజుల పాటు ఇలాగే ఉంటే లాభాల పంట పండినట్లే ! కార్తికేయ – పాయల్ రాజ్ పుత్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అజయ్ భూపతి దర్శకత్వంలో అశోక్ రెడ్డి నిర్మించాడు .

English Title: shocking collections for RX 100