కాచిగూడ ట్రైన్ ప్రమాదానికి కారణాలు ఏంటంటే…


కాచిగూడ ట్రైన్ ప్రమాదానికి కారణాలు ఏంటంటే...
కాచిగూడ ట్రైన్ ప్రమాదానికి కారణాలు ఏంటంటే…

ఏ ఫిలిం బై అరవింద్ సినిమాలో ఒక సూపర్ డైలాగ్ ఉంటుంది. “ప్రమాదం అనేది చెప్పి జరగదు. అది జరిగేంతవరకు మనకు తెలియదు. జరిగింత తరువాత చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటారు.”అని, వినడానికి కొంచెం కష్టం గా ఉన్నా, ఈ విషయం నిజమే. నిన్న సోమవారం జనాలు అందరూ ఉద్యోగాలకి, పనులకి బయలుదేరి వెళ్తూ ఉండగా కాచిగూడ స్టేషన్ లో జరిగిన రైలు ప్రమాదం అందరినీ దిగ్బ్రాంతి కి గురి చేసింది. జరిగిన ప్రమాదం సాంకేతిక లోపం వలన అని బయటకు తెలుస్తున్నా, ఘటన జరిగింది స్టేషన్ పరిధిలో కాబట్టి, రెండు ట్రైన్ ల వేగం తక్కువ ఉండటం వల్ల పెను ప్రమాదం జరగలేదు. ఒకవేళ అలా కాకపోతే, జరిగేది ఊహించుకోవడానికి భయం వేస్తుంది.

ప్రమాదం వెనుక కారణాలు ఏంటంటే,

· కాచిగూడ స్టేషన్ లోకి సోమవారం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో లింగంపల్లి నుంచి ఫలక్ నుమా వెళ్లే ఎంఎంటిఎస్ ట్రైన్ రెండో నెంబర్ ప్లాట్ ఫాం కి వచ్చింది. అయితే అంతకు ముందే కర్నూల్ టౌన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కూడా కాచిగూడ స్టేషన్ వద్దకు వచ్చింది

· ఆ రైలు మూడవ నంబర్ ప్లాట్ ఫామ్ కి వెళ్లాలి కానీ హోం సిగ్నల్ దగ్గర ఆగింది. 10 గంటల 30 నిమిషాల సమయంలో ఆ రైలు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రధాన లైన్ మీదుగా వచ్చినందువల్ల ఆ ట్రైను మొదట ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ ట్రాక్, తర్వాత రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ ట్రాక్ దాటుకొని మూడవ నంబర్ ప్లాట్ ఫామ్ ట్రాక్ కి వెళ్ళాలి

· ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ మొదటి నంబర్ ప్లాట్ ఫామ్ ట్రాక్ దాటుకొని, తర్వాత రెండో నెంబర్ ప్లాట్ ఫాం మీదకి వచ్చిన సమయంలో అప్పటికే రెండో నెంబర్ ప్లాట్ ఫారం మీద ఆగి ఉన్న ఎంఎంటీఎస్ రైలు ముందుకు కదిలింది.

· దీంతో ఎంఎంటీఎస్ రైలు నేరుగా వెళ్లి ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ఇంజన్ ని ఢీ కొట్టింది. సంబంధిత ఘటనలో ఇంటర్ సిటీ రైలు ఇంజను ఎంఎంటీఎస్ లోకో పైలెట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లి పోయింది. ఎంఎంటిఎస్ ట్రైన్ యొక్క తొలి నాలుగు బోగీలు పైకి ఎగిరి, పట్టాల పక్కన పడిపోయాయి ఈ ఘటనలో దాదాపు 40 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి

· రెండు ట్రైన్ లలో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఆ రెండు రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికుల తో సహా యావత్ పట్టణంలో ఎంఎంటీఎస్ రైలు మార్గాలలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.