వివాదం సృష్టించనున్న సావిత్రి అసలు నిజం బుక్


shocking incidents in savitri life

మహానటి సావిత్రి బయోపిక్ తెలుగునాట సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . అప్పుల ఊబిలో కూరుకుపోయిన వైజయంతి మూవీస్ సంస్థ కు తిరిగి జవసత్వాలు అందించిన చిత్రం ” మహానటి ” . అయితే అంతటి గొప్ప చిత్రం పై అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఇక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అయితే మహానటి చిత్రం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా అసలు సావిత్రి జీవితం అర్దాంతరంగా ముగిసిపోవడానికి కారనాలు ఏంటో పుస్తకం రూపంలో అందరికీ తెలిసేలా చేస్తానని అంటున్నాడు .

సావిత్రి జీవితాన్ని దగ్గరగా చూడటమే కాకుండా ఆమె చివరి రోజులను క్షున్నంగా చూసిన వ్యక్తి పసుపులేటి రామారావు కావడంతో తప్పకుండా సంచలన నిజాలు వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది . ఇప్పటికే మహానటి చిత్రం లో చూపించిన చాలా సంఘటనలు నిజం కాదని ఆగ్రహం వ్యక్తం చేయగా , ఇప్పుడు రామారావు రాసే నిజాల వల్ల ఎలాంటి వివాదాలు చెలరేగ నున్నాయో చూడాలి . త్వరలోనే ” అద్భుత నటి సావిత్రి ” తెరవెనుక నిజానిజాలు పుస్తకం విడుదల చేయనున్నాడు పసుపులేటి రామారావు .