శ్రీ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు


shocking news :complaint on sri reddy వివాదాస్పద నటి శ్రీ రెడ్డి పై చెన్నై పోలీసులకు ఫిర్యాదు అందింది . శ్రీ రెడ్డి తనంతట తాను వ్యభిచారం చేసానని , అవకాశాల కోసం హీరోలతో అలాగే దర్శక నిర్మాతలతో పడుకున్నానని స్వయంగా చెబుతోంది కాబట్టి ఆమెపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఇండియన్ మక్కల్ మంద్రం అనే సంస్థ సభ్యుడు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసాడు . ఇన్నాళ్లు శ్రీ రెడ్డి టాలీవుడ్ ని మాలీవుడ్ ని కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించింది . ఓ ఊపు ఊపేసి అందరికీ షాక్ ఇచ్చిన ఈ భామకు తాజాగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి షాక్ ఇవ్వడం సంచలనంగా మారింది .

సోషల్ మీడియాలో అలాగే వీడియో ల రూపంలో పలువురు సినీ ప్రముఖులు నన్ను వాడుకున్నారని ఆరోపణలు చేసింది కాబట్టి ఆమె వ్యాఖ్యలనే ఆధారం చేసుకొని కేసు నమోదు చేసుకోవాలని కోరుతున్నాడు ఇండియన్ మక్కల్ మంద్రం సభ్యుడు . నిజంగా ఇది శ్రీ రెడ్డి కి షాకింగ్ న్యూసే ! ఎందుకంటే ఇన్నాళ్లు అందరినీ ఓ ఆట ఆడుకుంది శ్రీ రెడ్డి , కట్ చేస్తే ఇప్పుడు శ్రీ రెడ్డి పై కేసు నమోదు అయితే కనుక ఇబ్బంది పడాల్సి వస్తుంది . చెన్నై పోలీసులు ఒకవేళ కేసు నమోదు చేసి శ్రీ రెడ్డి ని అరెస్ట్ చేస్తారా ? లేక ఫిర్యాదు ని తిరస్కరిస్తారా చూడాలి .

English Title: shocking news :complaint on sri reddy