మహేష్ రెమ్యూనరేషన్ అంతనా ?


మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడి
మహేష్ బాబు మరియు అనిల్ రావిపూడి

మహర్షి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మహేష్ బాబు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా కోసం మహేష్ బాబు ఏకంగా 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట ! టాలీవుడ్ లో ఇదే హయ్యెస్ట్ అవుతుంది , ఈ విషయం కనుక నిజమే అయితే . టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న విషయం తెలిసిందే దాంతో ఈ భారీ మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు నిర్మాతలు దిల్ రాజు , అనిల్ సుంకర .

ఈ సినిమాకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒకవైపు మహేష్ బాబు క్రేజ్ అయితే మరోవైపు అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డ్ . ఇప్పటివరకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 4 చిత్రాలు కూడా సూపర్ హిట్స్ అయ్యాయి . అలాగే దిల్ రాజు వ్యాపార శైలి వల్ల కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమని భావిస్తున్నారు అందుకే మహేష్ బాబు కు 50 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు భోగట్టా !