విజయ్ దేవరకొండ అందుకున్న డబ్బులు ఎంతో తెలుసా


shocking remunaration for vijay devarakonda

అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ అయితే అంతటి సంచలన చిత్రంలో నటించినందుకు గాను ఈ హీరో అందుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా …… …. కేవలం 5 లక్షలు మాత్రమే నట ! ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో మంచి గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ కు పెళ్లి చూపులు చిత్రం బ్రేక్ నిచ్చింది దాంతో ఒక్కసారిగా విజయ్ దేవరకొండ హాట్ కేక్ అయిపోయాడు ఇక అదే సమయానికి సెట్స్ మీదకు వెళ్లిన అర్జున్ రెడ్డి చిత్రంలో నటించినందుకు గాను కేవలం అయిదు లక్షల పారితోషికం మాత్రమే ఇచ్చారు .

కట్ చేస్తే అర్జున్ రెడ్డి ప్రభంజనం సృష్టించింది ఇంకేముంది వసూళ్ళ సునామీతో ఆ తర్వాత లాభాల్లో కొంత వాటా విజయ్ దేవరకొండ ని వరించింది . అర్జున్ రెడ్డి చిత్రం ఒక్కసారిగా విజయ్ దేవరకొండ ని స్టార్ ని చేసింది , ఇప్పుడు ఈ హీరో యూత్ ఐకాన్ . దాంతో రౌడీ అనే బ్రాండ్ క్రియేట్ చేసాడు . ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ . నోటా , గీత గోవిందం , టాక్సీ వాలా . గీత గోవిందం ఆగస్టు లో విడుదల అవుతుండగా టాక్సీ వాలా మాత్రం ఎప్పుడు విడుదల అవుతుందో తెలీడం లేదు . నోటా తుది మెరుగులు దిద్దుకుంటోంది .

English Title: shocking remunaration for vijay devarakonda