దేవుడా ! సంపూర్ణేష్ బాబు మళ్ళీ వస్తున్నాడ్రా బాబూ !


సంపూర్ణేష్ బాబు ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి లేదు . హృదయ కాలేయం చిత్రంతో యావత్ తెలుగు చిత్ర పరిశ్రమని షాక్ కి గురిచేసిన నటుడు సంపూర్ణేష్ బాబు . సెటైరికల్ హీరోయిజం తో రూపొందించిన హృదయ కాలేయం చిత్రాన్ని చూసిన వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూనే మళ్ళీ మళ్ళీ ఆ సినిమాని చూసారు అలాగే అదేపనిగా ప్రచారం చేసి పెట్టారు కూడా దాంతో ఏ హీరోకు రానంత పబ్లిసిటీ ఫ్రీగా కొట్టేసాడు సంపూర్ణేష్ బాబు .

కట్ చేస్తే నాలుగేళ్ళ తర్వాత కొబ్బరిమట్ట అంటూ వస్తున్నాడు . హృదయ కాలేయం చిత్ర దర్శకుడు స్టీవెన్ శంకర్ ఈ కొబ్బరిమట్ట చిత్రానికి దర్శకుడు . ఇక ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ఏకంగా మూడు పాత్రల్లో నటిస్తున్నాడు . ఈ మూడు పాత్రల్లో హీరో యిజాన్ని మరోసారి చీల్చి చెండాడనున్నట్లు తెలుస్తోంది . అనితరసాధ్యమైన పనులను అవలీలగా చేయడమే హీరోయిజం అందునా తెలుగు సినిమాల్లో ఇది మరీ ఎక్కువ దాన్నే మరోసారి ఛాలెంజ్ చేసేలా పలు సన్నివేశాలను చిత్రీకరించారట కొబ్బరిమట్ట చిత్రంలో . ఈ చిత్రంతో టాలీవుడ్ మేకర్స్ ని మరోసారి సవాల్ చేయడం ఖాయమని ఆ చిత్రానికి పనిచేసిన వాళ్ళు అంటున్నారు . మొత్తానికి సంపూ టాలీవుడ్ లో ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉన్నాడు . ఇక ఈ కొబ్బరిమట్ట ఎలాంటి జర్క్ లు ఇవ్వనుందో చూడాలి . ఈ వేసవిలోనే కొబ్బరిమట్ట రానుంది .