ఆ హీరోని పెళ్ళి చేసుకుంటానంటున్న హీరోయిన్


Shocking Sara alikhan wants two men , one for marriage one for dating

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని పెళ్ళి చేసుకునే చాన్స్ వస్తే వదులుకోనని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ . ఓ షోలో పాల్గొన్న ఈ భామని అడిగిన ప్రశ్నకు టక్కున రణబీర్ కపూర్ ని పెళ్ళి చేసుకోవాలనే ఆశ ఉందని , అవకాశం వస్తే తప్పకుండా చేసుకుంటానని సమాధానం ఇచ్చింది . సైఫ్ అలీఖాన్ – అమృతా సింగ్ కూతురు అయిన సారా అలీఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది . తాజాగా ఈ భామ వివాదాస్పద చిత్రం కేదార్ నాథ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన నటించింది . కేదార్ నాథ్ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది .

హిందువుల పవిత్ర ప్రార్ధనా మందిరం కేదార్ నాథ్ కాగా ఈ సినిమాలో లిప్ లాక్ లతో ట్రైలర్ రిలీజ్ చేసారు . ఇప్పుడా ట్రైలర్ పట్ల , సినిమా పట్ల పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది . డిసెంబర్ లో విడుదల కానున్న ఆ చిత్రం ముందు ముందు ఎలాంటి వివాదాలు రాజేస్తుందో కానీ ఈ భామ రణబీర్ కపూర్ ని పెళ్ళి చేసుకుంటానని చెప్పడమే కాకుండా డేటింగ్ చేయాల్సి వస్తే కుర్ర హీరో ఆర్యన్ తో చేస్తానని చెప్పి షాక్ ఇచ్చింది . అంటే ఈ భామకు ఇద్దరు కావాలట ! హతవిధీ ……. భీభత్సమే అన్నమాట .

English Title: Shocking :Sara alikhan wants two men , one for marriage one for dating