అఖిల్, పూజల మధ్య షూస్ లింక్ ఏంటి?


 

Shoes connect between akhil and pooja for most eligible bachelor
Shoes connect between akhil and pooja for most eligible bachelor

అఖిల్ అక్కినేని హీరో అవుదామనుకున్నప్పుడు త్వరలోనే స్టార్ హీరో అక్కినేని ఫ్యామిలీ నుండి వస్తున్నాడని అందరూ భావించారు. మహేష్ వంటి హీరో సైతం అఖిల్ ను ఆకాశానికి ఎత్తేయడంతో ఇక అతనికి తిరుగు లేదనుకున్నారు. అయితే అఖిల్ నటించిన మొదటి మూడు చిత్రాలు దారుణమైన ప్లాపులుగా మిగిలాయి. మూడు సినిమాలు చేసినా ఇంకా ఒక్క హిట్ కూడా అందుకోకపోవడం బహుశా ఏ స్టార్ హీరో వారసుడికి జరగలేదేమో. నాలుగో ప్రయత్నంలోనైనా ఎలాగైనా హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాడు అఖిల్. ఈసారి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ ఈ సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలు చూస్తుండడంతో అందరికీ ఒక రకమైన భరోసా దొరికినట్లయింది.

ఇక ఈ సినిమా విషయానికి వస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అని అందరికీ కనెక్ట్ అయ్యే టైటిల్ పెట్టారు. అలాగే ఈ సినిమాలో అఖిల్ ఫస్ట్ లుక్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అఖిల్ వీధుల్లో చెప్పులు/షూస్ లేకుండా ఒట్టి కాళ్లతో నడుచుకుంటూ వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది. దీని వెనుక పెద్ద కారణమేమి ఉంటుందని ఎవరూ అనుకోలేదు. అయితే మొన్న పూజ హెగ్డే ఫస్ట్ లుక్ విడుదల చేసాక అందరికీ ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఎందుకంటే అక్కడ అఖిల్ షూస్ లేకుండా నడుస్తూ ఉంటే ఇక్కడ పూజ హెగ్డే చేతిలో షూస్ పట్టుకుని మైక్ ముందు నిల్చుని ఉంది. ఈ రెండు సందర్భాలకు ఏమైనా లింక్ ఉందా అని అందరూ ఇప్పుడు చర్చించుకోవడం కనిపిస్తోంది.

పూజ హెగ్డే ఈ చిత్రంలో చాలా విభిన్నంగా ఒక స్టాండప్ కామిక్ గా కనిపించనుంది. ఒక హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయడం బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. ఇంతకీ వీళ్లిద్దరి షూస్ కహాని ఏమిటో తెలియాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. లేదా టీజర్/ట్రైలర్ లో ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. గోపి సుందర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు కాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.