ఆర్ఆర్ఆర్… రాజమౌళి రిస్క్ చేస్తున్నాడా?


SS Rajamouli
ఆర్ఆర్ఆర్… రాజమౌళి రిస్క్ చేస్తున్నాడా?

దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న దర్శకుడు. తెలుగు సినిమాకు అగ్ర దర్శకుడు. బాహుబలి వంటి కనీవినీ ఎరుగని హిట్ తర్వాత రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం రీసెంట్ గా బల్గేరియాలో ఒక షెడ్యూల్ ను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న విషయం తెల్సిందే. త్వరలో హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.

సాధారణంగా రాజమౌళి భారీ చిత్రాలు అన్నీ మూడు గంటలకు దగ్గరగా ఉంటాయి. సినిమా నిడివి ఎక్కువ ఉన్నా పట్టు సడలకుండా చెప్పడం రాజమౌళికే చెల్లింది. బాహుబలి రెండు భాగాలు కూడా 2 గంటల 45 నిమిషాలకు పైనే ఉన్నాయి. కానీ ఈసారి రాజమౌళి దీనికి భిన్నంగా వ్యవహరించనున్నాడు. ఆర్ఆర్ఆర్ చిత్ర నిడివి రెండు గంటల ముప్పై నిమిషాలకు మించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఇద్దరు పోరాట యోధుల గురించి కథ చెప్పేటప్పుడు, అందునా ఇద్దరు టాప్ హీరోలు కలిసి నటిస్తున్నప్పుడు తక్కువ నిడివి ఉంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారేమో రాజమౌళి.