ఎన్టీఆర్ మహానాయకుడు రన్ టైం ఎంతో తెలుసా


Short run time for NTR Mahanayakudu

ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది ఈరోజు . ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు . దాంతో ఈనెల 22న రిలీజ్ కి మార్గం సుగమం అయ్యింది . ఇక ఈ సినిమా రన్ టైం ఎంతో తెలుసా ……. రెండు గంటల ఎనిమిది నిముషాలు మాత్రమే . ఎన్టీఆర్ కథానాయకుడు మాత్రం పది నిముషాలు తక్కువ మూడు గంటలు కాగా అది సినిమాకు మైనస్ అయ్యిందని భావించిన దర్శకుడు క్రిష్ రెండో పార్ట్ ని మాత్రం రెండు గంటల ఎనిమిది నిమిషాలకు కుదించడం గమనార్హం .

 

మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు ఘోర పరాజయం పొందడంతో రెండో పార్ట్ పై చాలా దృష్టి పెట్టి చాలా సన్నివేశాలను రీ షూట్ చేసారు . అనవసరం అనుకున్న సన్నివేశాలను తగ్గించారట దాంతో తక్కువ రన్ టైం కుదిరింది . ఈనెల 22 న విడుదల కానున్న ఎన్టీఆర్ మహానాయకుడు పై బాలయ్య తో పాటుగా క్రిష్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . మరి ఈ సినిమా ఏమౌతుందో తెలియాలంటే ఈనెల 22 వరకు ఎదురు చూడాల్సిందే .

English Title: Short run time for NTR Mahanayakudu