సాహో మేకింగ్ వీడియో 2 వచ్చేసింది


Shradda kapoor birth day special saaho teaser 

ఈరోజు బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని సాహో మేకింగ్ వీడియో 2 రిలీజ్ చేసారు ఆ చిత్ర బృందం . సాహో మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది . భారీ యాక్షన్ విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ సినిమాని తలపిస్తున్నాయి . ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రంలో బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది .

 

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్ట్ 15 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది . విజువల్స్ చూస్తుంటే తప్పకుండా తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా ఉంది సాహో .

English Title: Shradda kapoor birth day special saaho teaser