ప్రభాస్ ని అవమానించిన శ్రద్దా కపూర్


Prabhas And Shraddha Kapoor
Prabhas And Shraddha Kapoor

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని అవమానించింది సాహో హీరోయిన్ శ్రద్దా కపూర్ . సాహో చిత్రంలో ప్రభాస్ తో రొమాన్స్ చేసిన ఈ భామ తన అభిమాన తెలుగు హీరో మహేష్ బాబు అంటూ చెప్పేసి షాక్ ఇచ్చింది , ప్రభాస్ ని అవమానించింది . ఒకవైపు ప్రభాస్ తో నటిస్తూ ఆ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న శ్రద్దా కపూర్ తన అభిమాన హీరో ఎవరు ? అన్న ప్రశ్నకు ఏమాత్రం సంకోచం లేకుండా మహేష్ బాబు అంటూ చెప్పేసింది .

మహేష్ బాబు అంటే ఇష్టపడని హీరోయిన్ లు ఎవరు ఉంటారు ? అయినా ప్రభాస్ తో నటిస్తూ మరొక హీరో పేరు ఎలా చెబుతుంది ? ఇది ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించే అంశమే ! భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో ఆగస్టు 30 న భారీ ఎత్తున విడుదల కానుంది . రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో ప్రమోషన్ లో పాల్గొంటోంది శ్రద్దా కపూర్ .