సల్మాన్ ఖాన్ ని రిజెక్ట్ చేసిన ప్రభాస్ హీరోయిన్


Shraddha Kapoor Rejected Salman Khan
Shraddha Kapoor Rejected Salman Khan

ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటించిన శ్రద్దా కపూర్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే ఛాన్స్ స్వయంగా సల్మాన్ ఖాన్ ఆఫర్ ఇస్తే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసిందట. ఈ విషయాన్నీ శ్రద్దా కపూర్ స్వయంగా వెల్లడించింది. అయితే సల్మాన్ ఖాన్ సరసన నటించే ఛాన్స్ ఇప్పుడు కాదట అయిదేళ్ల క్రితం సినిమాల్లోకి రాకముందు మొదటగా డెబ్యూ ఛాన్స్ సల్మాన్ ఇచ్చాడట!

అయితే ఆ ఆఫర్ ని తిరస్కరించానని , అప్పుడు నా ద్రుష్టి అంతా చదువు మీదే ఉందని అంటోంది. అయితే అమితాబ్ బచ్చన్ సినిమాలో నటించే చాన్స్ రావడంతో ఒప్పుకున్నానని , చిన్న పాత్రే అయినప్పటికీ నాకు నచ్చింది కాబట్టి చేసానని అంటోంది. అయితే శ్రద్దా కపూర్ కు కమర్షియల్ హిట్ ని ఇచ్చింది మాత్రం ఆషీకీ 2 మాత్రమే!

ఆషీకీ 2 బ్లాక్ బస్టర్ కావడంతో ఇక ఈ భామకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. ఇక ఇప్పుడేమో ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటించింది. ఇక ఈ సినిమా ఆగస్టు 30 న విడుదల అవుతోంది . ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకుంది ఈ భామ. తెలుగు , హిందీ బాషలలో సాహో భారీ ఎత్తున విడుదల కానుంది.