‘సాహో’ కోసం శ్రద్ద కపూర్ తీసుకున్నది అంతేనా..!


Shraddha Kapoor Saaho Remuneration
Shraddha Kapoor Saaho Remuneration

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శ్రద్దా కపూర్ హీరోయిన్ గా యువి క్రియేషన్స్ పతాకంపై సుజీత్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సాహో‘. 350కోట్ల భారీ బడ్జెట్తో, హై టెక్నీకల్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ చూసి ఓహో అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

నటీనటులు పరంగా 100కోట్లు అందరి రెమ్యునరేషన్లకే సరిపోయిందని, ప్రభాస్ కి ఒక్కడికే 100కోట్లు ఇచ్చారని వినికిడి. ఇక హీరోయిన్ కోసం శ్రద్ధకపూర్ కి దాదాపు 7కోట్ల  రూపాయల భారీ పారితోషికం అందుకొందని, చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. హిందీ సినిమాల్లో కూడా ఆమెకు ఇప్పటివరకు అంత ఇవ్వలేదని, బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అయితే సాహో” సినిమా బడ్జెట్ 350 కోట్లు దాకా అయ్యిందని ఇండస్ట్రీలో టాక్. శ్రద్ధకి 7కోట్లు ఇవ్వడం పెద్ద విషయం కాదు కానీ, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. “సాహో” సినిమా కోసం కథానాయికగా శ్రద్ధ కపూర్ పుచ్చుకొన్న మొత్తం 3కోట్లు మాత్రమేనట.

మన టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కూడా 1,2 కోట్లు వరకు తీసుకొంటారన్న విషయం తెలిసిందే! దాన్ని బట్టి శ్రద్ధకపూర్ కి మూడు కోట్లు రీజనబుల్ అని చెప్తున్నారు. సాహో ఒకేసారి తెలుగు, తమిళ్, మలయాళం, హింధీ నాలుగు భాషల్లో ఆగస్ట్ 30న విడుదలవుతుంది. మరి ఈ చిత్రం శ్రద్ద కపూర్ కి టాలీవుడ్ లో ఎంతవరకు బ్రేక్ ఇస్తుందో చూడాలి మరీ..!