రక్తం ధారపోసి సినిమా చేశాం.. పైరసి చేయొద్దు అంటున్న సాహో భామ!!


రక్తం ధారపోసి సినిమా చేశాం.. పైరసి చేయొద్దు అంటున్న సాహో భామ!!
రక్తం ధారపోసి సినిమా చేశాం.. పైరసి చేయొద్దు అంటున్న సాహో భామ!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-శ్రద్ద కపూర్ జంటగా యువి  క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వాల్యూస్‌తో  సుజీత్ దర్శకత్వంలో రూపొందిన  యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం  ‘సాహో’.  తెలుగులో శ్రద్ద కపూర్ కి ఇదే తొలి సినిమా కావడం విశేషం. నీల్ నితిన్ ముఖేష్, టైగర్ ష్రాఫ్, టిను ఆనంద్, అరుణ్ విజయ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు.

జాక్విలిన్ పెర్నాండెజ్ ప్రత్యేక నృత్యగీతంలో నర్తించింది. తెలుగుతో సహా మలయాళ, తమిళ, హిందీ నాలుగు భాషల్లో సాహో  విడుదల కావడంతో దేశవ్యాప్తంగా సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో భారీ రేంజ్‌లో ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ సాహోలో ప్రభాస్ యాక్షన్, సుజీత్ స్క్రీన్ ప్లే, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందని అంటున్నారు. తెలుగోడు గర్వించదగిన సినిమా సాహో అని కితాబిస్తున్నారు.

ఈ నేపథ్యంలో సాహో సినిమాను పైరసీ చేయొద్దంటూ స్టన్నింగ్ బ్యూటీ  శ్రద్ద కపూర్ వార్నింగ్ ఇచ్చింది. ”వరల్డ్ సాహో డే వచ్చేసింది. చెమట, రక్తం ధారపోసి ఈ భారీ చిత్రాన్ని చిత్రీకరించాం. ఎన్నో అవాంతరాలను ఛేదిస్తూ మీ ముందుకు వచ్చాము. ‘సాహో’ సినిమా డై హార్డ్ ఫ్యాన్స్‌ సొంతం.

పైరసీ చేయొద్దు అని చెప్పింది శ్రద్ధ. భారీ యాక్షన్ యాక్షన్ ఎంటెర్టైనెర్ మూవీ సాహోను మీ దగ్గర్లోని థియేటర్లలోనే చూడండి. పైరసీకి నో చెప్పండి. ఒకవేళ ఎవరైనా  ఈ సినిమా పైరసీ చేసినట్లు తెలిస్తే వెంటనే పైరసీ ఆర్గనైజేషన్‌కు సమాచారం అందించండి అని అంటూ పైరసీని అరికట్టేలా తన వంతు మెసేజ్ ఇచ్చింది అందాల భామ శ్రద్ద కపూర్..!!