సమంత ని అవమానించిన నాని హీరోయిన్


సమంత ని అవమానించింది నాని హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ . కన్నడ భామ అయిన శ్రద్దా శ్రీనాథ్ తాజాగా నాని హీరోగా నటించిన ” జెర్సీ ” చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . జెర్సీ చిత్రంలో అద్భుత నటనని ప్రదర్శించి అందరి చేత ప్రశంసలు అందుకుంటున్న ఈ భామ సమంత ని విమర్శించి అభాసుపాలయ్యింది . ఇంతకీ ఈ భామ సమంత ని ఎందుకు అన్నట్లో తెలుసా ……. 
 
కన్నడంలో హిట్ అయిన యు టర్న్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసారు . తెలుగులో సమంత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే . అయితే అదే పాత్రని కన్నడంలో శ్రద్దా శ్రీనాథ్ పోషించింది . దాంతో నా సినిమాని తెలుగులో రీమేక్ చేసారు కదా చూద్దామని అరగంట చూసాను అయితే అంతగా నాకు నచ్చకపోవడంతో ఇక సినిమా చూడటం వేస్ట్ అని కట్ చేశాను అని అనేసింది . దాంతో సమంత నటనను తక్కువ చేసి మాట్లాడతావా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సామ్ ఫ్యాన్స్ .