హీటెక్కిస్తున్న జెర్సీ భామ‌!


హీటెక్కిస్తున్న జెర్సీ భామ‌!
హీటెక్కిస్తున్న జెర్సీ భామ‌!

అందం, అభిన‌యం.. ఈ రెండూ వున్న హీరోయిన్ శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్‌. క‌న్న‌డ ఇండ‌స్ట్రీలో `యూ ట‌ర్న్` చిత్రంతో న‌టిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. బోల్డ్ పాత్ర‌ల‌తో పాటు గ్లామ‌ర్ డాల్‌గా కూడా క‌నిపించ‌డానికి త‌ను రెడీ అని సంకేతాలిచ్చిన శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ తెలుగులో నాని హీరోగా న‌టించిన `జెర్సీ`, సిద్ధు జొన్న‌ల‌గడ్డ న‌టించిన `కృష్ణ అండ్ హిస్ లీలా` చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది.

`కృష్ణ అండ్ హిస్ లీలా` చిత్రంలో మ‌రింత బోల్డ్‌గా న‌టించి గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు సై అంటోంది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా బోల్డ్‌గా కామెంట్‌లు చేసి వార్త‌ల్లో నిలిచిన శ్ర‌ద్దా తాజాగా మ‌రోసారి సోష‌ల్‌మీడియా వేదిక‌గా హ‌ల్ చ‌ల్ చేస్తోంది. శ్ర‌ద్ధా తాజాగా సోష‌ల్‌మీడియాలో షేర్ చేసిన ఫోటో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటోలో శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ హాట్ హాట్‌గా అందాల విందు చేయ‌డ‌మే.

ఇటీవ‌ల సినీ ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న వివ‌క్ష గురించి, పెళ్లైన హీరోయిన్‌ల‌కు అవ‌కాశాలు ఎందుకు ఇవ్వ‌రంటే ఘాటుగా ప్ర‌శ్నించి వార్త‌ల్లో నిలిచింది. ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఏకంగా ఐదు చిత్రాల్లో న‌టిస్తోంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో `చ‌క్ర‌`, క‌న్న‌డ‌లో `గోద్రా`, పాంట‌మ్‌, రుద్ర‌, ప్ర‌యాగ‌, మార చిత్రాల్లో న‌టిస్తోంది.