ఆర్ ఆర్ ఆర్ లో శ్రియ… కన్ఫర్మ్ చేసేసిందిఆర్ ఆర్ ఆర్ లో శ్రియ... కన్ఫర్మ్ చేసేసింది
ఆర్ ఆర్ ఆర్ లో శ్రియ… కన్ఫర్మ్ చేసేసింది

అందాల భామ శ్రియ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ ఆమె గ్లామర్ ను మైంటైన్ చేస్తున్న తీరుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇప్పటికే అదే ఫిజిక్ తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇవ్వగల శ్రియ ప్రస్తుతం అడపాదడపా సినిమాలను అందుకుంటూనే ఉంది. తెలుగు తెరపై శ్రియ కనిపించి చాలా కాలమే అయినప్పటికీ ప్రస్తుతం ఒక భారీ ప్రాజెక్టును చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో శ్రియ నటించనుందని గత కొన్ని రోజుల నుండి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ మొత్తానికి శ్రియ వైపు నుండి క్లారిటీ వచ్చింది.

ఇటీవలే తన ఫాలోయర్స్ తో లైవ్ ఇంటరాక్షన్ సెషన్ లో పాల్గొంది శ్రియ. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ నేపథ్యంలో మీ భవిష్యత్తు ప్రాజెక్టులు ఏంటి అని అడగ్గా ఆర్ ఆర్ ఆర్ లో నటించబోతున్నానని తెలిపింది. ఇంకా తన సన్నివేశాల షూటింగ్ మొదలుకాలేదని లాక్ డౌన్ అయ్యాక సెట్స్ లో జాయిన్ అవుతానని తెలిపింది. తాను అజయ్ దేవగన్ కు జోడిగా నటిస్తున్నట్లు రివీల్ చేసింది. తమ పోర్షన్స్ ఫ్లాష్ బ్యాక్ లో భాగంగా వస్తాయని రివీల్ చేసింది.

ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే. చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తున్నాడు. అలియా భట్, ఒలీవియా వీరికి జోడీలుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయిందని రాజమౌళి ప్రకటించారు.

జనవరి 8, 2021న రిలీజ్ అనుకున్నా కానీ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో వచ్చే సమ్మర్ లో విడుదల కానుంది.