రహస్య వివాహం చేసుకున్న శ్రియా శరన్


Shriya Saran marries Russian boyfriend

గతనెలలోనే శ్రియా శరన్ పెళ్లి వార్తల గురించి పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి అయితే శ్రియా కు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని ఆమె తల్లి ప్రకటించింది అంతేకాదు స్వయంగా శ్రియ కూడా పెళ్లి వార్తలను ఖండించింది . కట్ చేస్తే నెల తిరక్కుండానే రహస్య వివాహం చేసుకొని అభిమానులకు పిచ్చ షాక్ ఇచ్చింది శ్రియా శరన్ . తన బాయ్ ఫ్రెండ్ అయిన అండ్రీ కొచ్చీవ్ ని ఈనెల 12న రహస్య వివాహం చేసుకుంది శ్రియా .

 

రష్యా కు చెందిన క్రీడాకారుడు , వ్యాపారవేత్త అయిన అండ్రీ తో గతకొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే . అండ్రీ తో శ్రియా ప్రేమాయణం సాగిస్తోందని వార్తలు వచ్చినప్పటికీ జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పుకొచ్చింది కట్ చేస్తే ముంబై లో మార్చి 12న అతికొద్ది మంది ప్రముఖుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది . అయితే పెళ్లి అయి వారం రోజులు కావస్తున్నా ఇప్పటివరకు శ్రియా మాత్రం ఇంకా స్పందించలేదు మరి .