లోక నాయకుడి కూతురు పెద్ద తాగుబోతు

Shruthi Haasan drinking problem
Shruthi Haasan drinking problem

లోక నాయకుడు “కమల్ హాసన్” కూతురిగా దాదాపు తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ చిత్రాలకి పరిచయం అయిన నటి “శృతి హాసన్”. మొదట అన్ని పరిశ్రమలో ఐరన్ లెగ్ లేడి అనిపించుకున్న శృతి హాసన్ తర్వాత ఒక్కొక్క సినిమాని మంచిగా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చి హిట్ సినిమాలు తన పేరు మీద కూడా ఉండేలా చేసుకొని తండ్రికి దగ్గ కూతురిగా పేరు సంపాదించింది. నటిగా కొనసాగుతూనే గాయనిగా కూడా అప్పుడప్పుడు తన గళం విప్పేది.

అలా సినిమాలు చేసుకుంటున్న నటి ఒకేసారిగా సినిమాలు మానేసి ఒక 2,3 సంవత్సరాలు టైమ్ తీసుకుంది. అలా టైమ్ తీసకున్నందుకు ఎవరైనా మీడియా అడిగే ప్రశ్నలకి సమాదానం శృతి హాసన్ చెప్పినట్లు చెప్పకపోవచ్చు. ఎందుకంటే తను జరిగినది మొత్తం చెప్పేసింది కాబట్టి. అసలు విషయం ఏంటంటే శ్రుతికి బాగా మద్యం సేవించే అలవాటు ఉందంటా.. ఆ అలవాటు ఎంత మానుకుందాం అనుకున్నా కూడా అస్సలు కుదిరేది కాదంటా.. అలా తాను సినిమాలకి కూడా ఎక్కడ తాగి వస్తానో అని చెప్పి కొన్ని సినిమాలని ఆపేసి మద్యం మానెయ్యాలని అనుకుందంటా.

అందువలన తను సినిమాలకి దూరం అయ్యాను అని ఎటువంటి దాపరీత్యాలు లేకుండా చెప్పింది. అదే ఆ పరిస్థితి లో ఇంకొక నటి ఉంటే అలా చెప్పే వారు కాకపోవచ్చు అంటున్నారు ఆమె సన్నిహితులు. ఇప్పుడు శృతి మొత్తానికి మధ్యం మానేసింది. కొద్ది రోజులో మళ్ళీ సినిమాలో నటిగా తన రెండవ ఇన్నింగ్స్ ని పుణ: ప్రారంబించనుంది.

నిజానికి శృతి హాసన్ చేసిన దాంట్లో తప్పు ఒప్పుల గురించి మాట్లాడటం కంటే తనని ఆదర్శంగా తీసుకొని కొంతమంది అయినా మద్యం, దూమపానం లాంటి వ్యసనాలకి బలి అవ్వకుండా ఉంటే చాలు అని శృతి మాటలు విన్నవారు ఎవ్వరైనా సరే! అనుకుంటారు.