శ్రుతి హరిహరన్ ని పక్కలో పడుకోమని 5 నిర్మాతలు అడిగారట


చిత్రపరిశ్రమలో కామాంధులు చాలామంది ఉన్నారని , నన్ను ఏకంగా అయిదుగురు నిర్మాతలు పడుకోమని అడిగారని ……అసలు ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఈ భామ సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు శ్రుతి ఆరోపణలు యావత్ చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

 

ఎవరైనా నా కోరిక తీర్చమని అడుగుతారు కానీ కన్నడ నాట మాత్రం మేము మొత్తం ఐదుగురం కాబట్టి మమ్మల్ని అందరినీ వరుసపెట్టి కోరిక తీర్చాలని , మాలో ఎవరికి మూడొస్తే వాళ్ళు ముందుగా వస్తారు అంటూ కూడా చెప్పాడట సదరు నిర్మాత. హీరోయిన్ లకు సినిమా రంగంలో రక్షణ లేదని అయినా నేను లొంగేది లేదని అంటోంది శ్రుతి హరిహరన్. గతకొంతకాలంగా కాస్టింగ్ కౌచ్ గురించి ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్ లు ఇటువంటి ఆరోపణలు చేశారు.