లవర్ కు దూరంగా ఉన్నందుకు బాధపడుతోంది


shruti haasan birth day wishes to lover

అసలే ప్రేమికుడి పుట్టినరోజు దాంతో ఒకింత సంతోషం కాగా మరోవైపు బాధతో సతమతం అవుతోంది అందాల భామ శృతి హాసన్ . ఈ భామ మైఖేల్ కోర్సెల్ ని ప్రేమిస్తున్న విషయం తెలిసిందే . అయితే మైఖేల్ పుట్టినరోజు సందర్బంగా అతడు ఒకచోట శృతి మరో చోట ఉన్నారు దాంతో అతడికి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ మైఖేల్ కు తన జీవితంలో ఎంతటి ప్రాధాన్యత ఉందో చెబుతోంది .

”పుట్టినరోజు సమయంలో నేను నీ దగ్గర లేకపోవడం బాధగా ఉంది అని అంటూనే నా ప్రతీ సందర్భంలో నన్ను నవ్విస్తూ , నవ్వుతు ఉండే ఫన్నీ గై హ్యాపీ బర్త్ డే మై బెస్ట్ ఫ్రెండ్ ” అంటూ ట్వీట్ చేసింది శృతి హాసన్ . గతకొంత కాలంగా సినిమాలు పక్కన పెట్టి ప్రియుడి తోనే ఎంజాయ్ చేస్తోంది ఈ భామ . ఆమధ్య ఈ ఇద్దరికీ పెళ్లి కూడా అయ్యిందని పుకార్లు చెలరేగాయి అయితే పెళ్లి ఇప్పట్లో కాదని తేల్చి చెప్పింది లే ఈ భామ .