పవన్ సరసన సినిమాను కన్ఫర్మ్ చేసిన శ్రుతి హాసన్


పవన్ సరసన సినిమాను కన్ఫర్మ్ చేసిన శ్రుతి హాసన్
పవన్ సరసన సినిమాను కన్ఫర్మ్ చేసిన శ్రుతి హాసన్

సరిగ్గా లాక్ డౌన్ కు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం వకీల్ సాబ్ లో శృతి హాసన్ నటిస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల తర్వాత వీరిద్దరూ మూడోసారి నటించబోతున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు శ్రుతి హాసన్ ఈ వార్తలకు స్పందించింది. అవన్నీ ఒట్టి రూమర్లేనని తనను ఎవరూ అసలు ఆ సినిమాలో నటించమంటూ సంప్రదించనేలేదని తెలిపింది.

కట్ చేస్తే శృతి హాసన్ ఇప్పుడు ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక కీలక పాత్ర చేస్తున్నానంటూ కన్ఫర్మ్ చేసింది. ఆ పాత్ర గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే మాత్రం మౌనం వహించింది. త్వరలోనే అన్నీ తెలుస్తాయని తెలిపింది. వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ ఉంటుంది. తమిళంలో అజిత్ సరసన విద్య బాలన్ పోషించిన పాత్రను ఇప్పుడు శృతి హాసన్ చేయబోతోందని అంటున్నారు.

వేణుశ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నాడు. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.