శృతి హాసన్ ని వదిలేసిన ప్రియుడు


అందాల భామ శృతి హాసన్ ని ఆమె ప్రియుడు మైఖేల్ వదిలేసాడు . తాజాగా మైఖేల్ కోర్సలే పెట్టిన పోస్ట్ తో ఈ విషయం బహిర్గతం అయ్యింది . కొంతకాలంగా శృతి హాసన్ – మైఖేల్ లు ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే . ప్రేయసి కోసం మైఖేల్ ఇండియాకు కూడా వచ్చాడు . అంతేకాదు శృతి – మైఖేల్ లు ముంబైలో కొంతకాలం ఉన్నారు కూడా . ఇక మైఖేల్ కోసం శృతి కూడా లండన్ వెళ్ళింది .

అక్కడ రోడ్లన్నీ ఈ ఇద్దరూ చుట్టేశారు అంతగా కలిసి పోయారు , ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో తాజాగా మైఖేల్ పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టించింది . అయితే శృతి ని మైఖేల్ వదిలేసినప్పటికీ తనే నా బెస్ట్ మేట్ అంటూ పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది . మొత్తానికి శృతి కి పట్టిన గ్రహణం వీడింది , ఇప్పటికైనా ప్రేమ , దోమ వదిలేసి కెరీర్ పైన ద్రుష్టి పెడుతుందేమో చూడాలి .