శృతి హాసన్ బోయ్ ఫ్రెండ్ తో ఎందుకు విడిపోయిందంటే


శృతి హాసన్ బోయ్ ఫ్రెండ్ తో ఎందుకు విడిపోయిందంటే
శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్

శృతి హాసన్ మైఖేల్ కోర్సలే రెండేళ్లుగా ప్రేమించుకున్నారు , అయితే ఇటీవలే విడిపోయారు నీ దారి నీది నా దారి నాది అని అనుకున్నారు . అయితే ఇలా ఈ ఇద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో తెలుసా …….మైఖేల్ కోర్సలే కు సంపాదన లేకపోవడమే ! లండన్ లో థియేటర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న మైఖేల్ కు అంతగా సంపాదన లేదు ఖర్చుల కోసం ఇంకా తల్లిదండ్రుల మీదే ఆధారపడుతున్నాడు దాంతో శృతి పలుమార్లు హెచ్చరించిందట సంపాదించడం నేర్చుకో అని .

కానీ మైఖేల్ కోర్సలే కు సంపాదన మార్గం లేకపోవడంతో విసిగి వేసారిన శృతి హాసన్ డబ్బులు లేని మైఖేల్ వద్దంటూ అతడికి హ్యాం డ్ ఇచ్చింది . శృతి హాసన్ – మైఖేల్ కోర్సలే విడిపోవడానికి ఇదే కారణం అంటూ ముంబై లో ప్రచారం సాగుతోంది . సినిమాల్లో ఓ వెలుగు వెలగాల్సిన ఈ భామ సినిమాలను పక్కన పెట్టి ప్రియుడితో రెండేళ్లు బాగానే ఎంజాయ్ చేసింది కానీ డబ్బులు సంపాదించలేని ప్రియుడు ఎందుకు అంటూ గుడ్ బై చెప్పేసిందట .