శృతి హాసన్ చేసిన వరస్ట్ డిష్ చెప్పిన బాయ్ ఫ్రెండ్

శృతి హాసన్ చేసిన వరస్ట్ డిష్ చెప్పిన బాయ్ ఫ్రెండ్
శృతి హాసన్ చేసిన వరస్ట్ డిష్ చెప్పిన బాయ్ ఫ్రెండ్

శ్రుతి హాసన్ ప్రస్తుతం ముంబైలో నివాసం ఉంటోన్న విషయం తెల్సిందే. అక్కడ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికతో కలిసి జీవిస్తోంది. ఇద్దరూ లివిన్ లో ఉంటున్నారు. సాధారణంగా శృతి హాసన్ మంచి కుక్. ఈ విషయం ఆమె సోషల్ మీడియా ఫాలోయర్స్ కు బాగా తెలుసు. అయితే టమాటో తొక్కు శృతి హాసన్ చాలా వరస్ట్ గా చేసిందని చెబుతున్నాడు ఆమె బాయ్ ఫ్రెండ్.

రీసెంట్ గా శృతి హాసన్ సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చింది. ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా ఈ లైవ్ సెషన్ లో పాల్గొన్నాడు. ఒక ఫాలోయర్ శృతి హాసన్ చేసిన వరస్ట్ డిష్ ఏంటి అని అడగ్గా దానికి ఆమె బాయ్ ఫ్రెండ్ సమాధానమిచ్చాడు.

టమాటో తొక్కు శృతి హాసన్ చేసిన వరస్ట్ డిష్ అని చెప్పాడు. టమాటో – ఉల్లిపాయతో కలిపి ఆమె తొక్కు చేసిందని అయితే అది సరిగా రాలేదని తెలిపాడు. సాధారణంగా శృతి హాసన్ చాలా బాగా వండుతుందని కితాబు ఇచ్చాడు లెండి.