సలార్ : ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంటున్న శృతి హాసన్

సలార్ : ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంటున్న శృతి హాసన్
సలార్ : ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుంటున్న శృతి హాసన్

శృతి హాసన్ ఈ ఏడాది క్రాక్ సినిమాతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా భారీ విజయం తన కెరీర్ కు పెద్ద బూస్టప్ అని చెప్పాలి. దీని తర్వాత శృతి హాసన్ తన కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకుంది. రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న సలార్ లో హీరోయిన్ గా ఎంపికైంది. కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే సలార్ ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ఇంకా శృతి హాసన్ సలార్ సెట్స్ లో జాయిన్ అవ్వలేదు. వచ్చే నెల నుండి శృతి హాసన్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది. అయితే ఈలోగా శృతి హాసన్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటోందని తెలుస్తోంది. పాత్ర ప్రకారం శృతి పాత్ర యాక్షన్ సన్నివేశాల్లో కూడా పాల్గొనాల్సి వస్తుందిట.

హోంబేలె ఫిల్మ్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.