సెట్ నుంచి వెళ్లిపోయి షాకిచ్చిన శృతిహాస‌న్‌!



సెట్ నుంచి వెళ్లిపోయి షాకిచ్చిన శృతిహాస‌న్‌!
సెట్ నుంచి వెళ్లిపోయి షాకిచ్చిన శృతిహాస‌న్‌!

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ స్టార్ నాయిక‌గా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. క‌మ‌ల్‌హాస‌న్ గారాల ప‌ట్టిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా హీరోయిన్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత శృతిహాస‌న్ త‌మిళ చిత్రం `లాభం`. విజ‌య్  సేతుప‌తి హీరోగా న‌టిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎస్‌.పి. జ‌న‌నాథ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ ధ‌ర్మ‌పురి, కృష్ణ‌గిరి ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రిగింది. ఈ విష‌యం ఆ నోల ఈ నోల పాకేస‌రికి చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌లు హీరో విజ‌య్‌ సేతుప‌తితో పాటు శృతిహాస‌న్‌ని చూసేందుకు ఎగ‌బ‌డ్డారు. దీంతో షాక్ కు గురైన శృతిహాస‌న్ టీమ్‌కు షాకిచ్చింది. ఉన్న‌ట్టుండి లొకేష‌న్ నుంచి వెళ్లిపోయింద‌ట.

క‌రోనా ప‌రిస్థితుల కార‌ణంగా స‌మూహాల్లో వుండ‌టం, తెలియ‌ని వాళ్ల‌ని క‌ల‌వ‌డం అంత మంచిది కాద‌ని శృతి భావించార‌ట‌. ఆ కార‌ణంగానే లొకేష‌న్ నుంచి స‌డ‌న్‌గా వెళ్లిపోయిన‌ట్టు చెబుతున్నారు. దీంతో యూనిట్ ప్యాక‌ప్ చెప్పేశార‌ట‌. `కోవిడ్ 19 వ‌ల్ల ప్ర‌తీ ఒక్క‌రి ఆరోగ్యానికి ప్ర‌మాదం వుంది. అది ఇంకా అంతం కాలేదు. ప్రొటోకాల్స్ పాటించ‌ని త‌రుణంలో ఒక మ‌హిళ‌గా, న‌టిగా జాగ్ర‌త్త‌లు తీసుకునే హ‌క్కు నాకు వుంది` అని ఇటీవ‌ల శృతిహాస‌న్ ట్వీట్ చేసిన విష‌యం తెలిసిందే.