విడిపోవడమే కరెక్ట్.. తండ్రి విడాకులపై శృతి హసన్ కామెంట్


Shruti Hassan Comment on Kamal Hassan Divorce
Shruti Hassan Comment on Kamal Hassan Divorce

పర్సనల్ లైఫ్ విషయాలు ఎన్ని ఉన్నా… అన్ని విషయాలను మీడియా ముందు బయటపెట్టాలంటే చాలా ధైర్యం కావాలి. చేసే కామెంట్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో అనే భయం కూడా చాలా మందిలో ఉంటుంది. అందుకే ఎన్ని రూమర్స్ వచ్చినా కొంత మంది వాటిని పట్టించుకోరు.  అయితే కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మాత్రం ఇలాంటి విషయాల్లో రూమర్స్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తుంది.

రీసెంట్ గా తన తల్లి దండ్రుల విడాకులపై అమ్మడు ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది. రీసెంట్ గా ఒక వెబ్ సైట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్ విషయాలపై మాట్లాడిన శ్రుతి కమల్ హసన్ – సారిక ల విడాకులపై కూడా వివరణ ఇచ్చింది. శృతి మాట్లాడుతూ.. ప్రపంచంలో చాలా మంది విడాకులు తీసుకున్నారు. కానీ మా పేరెంట్స్ సెలెబ్రెటీస్ కావడం కారణంగా వాళ్ళకు సంబంధించిన న్యూస్ వైరల్ అయ్యింది.
“వారిద్దరు విడిపోవాలని అనుకున్నప్పుడు వారి నిర్ణయం పట్ల నాకు సంతోషమేసింది. ఎందుకంటే కలిసి ఉన్నప్పుడు హ్యాపీగా లేకపోతే ఆ జీవితం వేస్ట్. అలాంటప్పుడు విడిపోవడమే కరెక్ట్. జీవితంలో ఇద్దరికి సమానంగా సంతోషంగా ఉండే హక్కు ఉంటుంది. అలాంటప్పుడు వారి సొంత నిర్ణయంలో తప్పు లేదు. ఆ విషయం నాకు చాలా రోజుల తరువాత అర్థమైంది. విడిపోయినప్పుడు కొంత బాధగా అనిపించినప్పటికి విడిపోవడమే మంచిది” అని శృతి వివరణ ఇచ్చింది. గతంలో స్శృతి మైకేల్ అనే వ్యక్తితో ప్రేమను కొనసాగించిన విషయం తెలిసిందే. ఆల్ మోస్ట్ పెళ్లికి డేట్ ఫిక్స్ అయ్యింది అన్న సమయంలో అమ్మడు విడిపోయింది. అందుకే ఇలా అనుభవంతో వివరణ ఇచ్చింది.