బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల్నితెలుసుకుంద‌ట‌!


బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల్నితెలుసుకుంద‌ట‌!
బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల్నితెలుసుకుంద‌ట‌!

వెన‌క్కి తిరుగి చూస్తే క్ష‌మించండి అంటోంది శృతి హాసన్‌. 2017 త‌రువాత తెలుగు సినిమాల్లో దాదాపుగా క‌నిపించ‌కుండా పోయిందీ సుంద‌రి. ప్రేమ‌లో మునిగితేలుతూ కెరీర్‌ని ప‌క్క‌న పెట్టేసింది. ప్రియుడు మైఖేల్ క్రేస‌న్‌కి బ్రేక‌ప్ చెప్పేశాక మ‌ళ్లీ సినిమాల‌పై దృష్టిసారించింది. ప్ర‌స్తుతం `క్రాక్‌` మూవీతో రీఎంట్రీ ఇస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ ఇటీవ‌లే మొద‌లైన విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే ఇటీవ‌ల తెలుగు సినిమాల‌పై ఓ జాతీయ మీడియా కిచ్చిన ఇంట‌ర్వ్యూలో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిందంటూ వార్త‌ల్లో నిలిచింది. తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ శారీలో రెడీ అయిన శృతీహాస‌న్ బ్యాక్ చూపిస్తూ ఫొటోని షేర్ చేసింది. అంతే కాకుండా ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని నెటిజ‌న్స్‌తో పంచుకుంది. వెన‌క్కి తిరిగిచూస్తే క్ష‌మించండి 2019ని ద్వేషించ‌మ‌ని చెప్ప‌డం లేదు. ఈ ఏడాది దాదాపుగా పూర్త‌యిపోయింది. ఈ ఏడాది జీవితంతో పాటు మాన‌వాళి బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల్నితెలుసుకున్నాను` అని తెలిపింది.

అంతేకాకుండా ప్ర‌కృతిప‌రంగా ఒంట‌రినే అని, నిజాయితీగ‌ల‌ వ్య‌క్తుల‌కు ఎలాంటి గౌర‌వం ఇవ్వాలో నేర్చుకున్నాను.  నేను కళ గురించి మరియు అది నాకు ఇచ్చే ప్రేమ గురించి సరికొత్త మార్గంలో నేర్చుకున్నాను. నేను సరికొత్త మార్గంలో ప్రేమించడం నేర్చుకున్నాను. చీకటి కాలంలో ఇది చెప్పడం వింతగా ఉంది`ని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది.