పవన్ కళ్యాణ్ సినిమాలో శృతి హాసన్.. నిజమేనా?


Shruti hassan to join vakeel saab soon
Shruti hassan to join vakeel saab soon

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న తాజా చిత్రం వకీల్ సాబ్ సినిమాపై మొదట్లో అంచనాలు ఎక్కువగా లేవు. అది పవర్ స్టార్ రీ ఎంట్రీ చిత్రమైనా సరే పింక్ రీమేక్ కావడంతో పవన్ అభిమానులు ఎక్కువ ఉత్సాహం చూపించలేదు. ఎందుకంటే పింక్ రీమేక్ లో హీరోయిజం పాళ్ళు తక్కువ. ఉన్నదంతా కోర్ట్ రూమ్ లో వాదనలతో గడిచిపోతుంది. అయితే ఎప్పుడైతే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైందో, సినిమాపై బజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ కళ్యాణ్ ఠీవిగా గుబురు గెడ్డంతో, ఒక పుస్తకంతో కూర్చున్న ఫోజ్ అభిమానులకు పిచ్చపిచ్చగా నచ్చేసింది.

ఇక నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన పాట అయితే రికార్డులను తిరగరాస్తోంది. ఇప్పటికే ఉన్న రికార్డులు చెరిపేసిన ఈ పాట ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మగువా మగువా అంటూ సాగే ఈ పాట ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకర్షిస్తోంది.

ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మెజారిటీ భాగం పూర్తి చేసుకున్నట్లు సమాచారం. మార్చ్ నెలాఖరుకు కానీ ఏప్రిల్ మొదటి వారంలో కానీ షూట్ మొత్తాన్ని పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. ఇక వకీల్ సాబ్ కు చెందిన తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శృతి హాసన్ కీలక పాత్రకు ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భాగంగా పవన్ కళ్యాణ్ భార్య పాత్ర ఉంటుంది. ఆ పాత్రకు శృతి హాసన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కలిసి చేసిన గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ఈ మధ్య కాలంలో శృతి హాసన్ ఎక్కువగా సినిమాలను ఒప్పుకోవట్లేదు. ఎక్కువగా సింగింగ్ మీద దృష్టి పెట్టిన శృతి, ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు వకీల్ సాబ్ ఒప్పుకున్నట్లు సమాచారం. చూడాలి మరి ఈ వార్త నిజమో కాదో!